మహిళపై అత్యాచారం, హత్య.. నిందితుడి అరెస్టు

24-09-2019 Tue 11:22 | Telangana
  • మద్యం మత్తులో ఉండగా బలవంతం
  • ఎదురు తిరిగేసరికి బండరాయితో మోదిన వైనం
  • అపస్మారక స్థితికి వెళ్లగానే ఘాతుకం
మద్యం మత్తులో ఉన్న మహిళపై అత్యాచారం చేయబోయి, ఆమె ఎదురు తిరిగేసరికి కొట్టి చంపేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు...నల్గొండ జిల్లా చింతపల్లి మండలానికి చెందిన ఓ మహిళ (43) భర్తతో విభేదాల కారణంగా హైదరాబాద్‌ చంపాపేటలో తన సోదరి కూతురు వద్ద ఉంటోంది.

సైదాబాద్‌, చంపాపేట పరిసరాల్లోని ఫంక్షన్‌ హాళ్లలో పనిచేసుకుంటూ జీవనోపాధి పొందుతోంది. ఈనెల 11న ఎప్పటిలాగే ఆమె పనిలోకి వెళ్లింది. ఆ రాత్రి ఆమెకు మద్యం దుకాణం వద్ద నల్గొండ జిల్లా చందంపేట మండలం పోల్యానాయక్‌ తండాకు చెందిన రమావత్‌ శుక్రూనాయక్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం ఆమెను బీఎస్‌ఎన్‌ఎల్‌ క్వార్టర్స్‌ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు.

అక్కడ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నిస్తే ఆమె ప్రతిఘటించింది. దీంతో సమీపంలో దొరికిన రాయితీసుకుని ఆమె తలపై కొట్టాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమెపై నిందితుడు అత్యాచారం చేసి, అనంతరం చంపేశాడు. ఇంటి నుంచి వెళ్లిన తన బంధువు తిరిగి చేరక పోవడంతో మరునాడు మృతురాలి సోదరి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో ఈనెల 13వ తేదీన వినయనగర్‌ కాలనీ బీఎస్‌ఎన్‌ఎల్‌ క్వార్టర్స్‌ సమీపంలో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టంలో అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలడంతో విచారణ మొదలుపెట్టారు. పలు ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించగా శుక్రూనాయక్‌ ఆదివారం చిక్కాడు. తమదైన శైలిలో విచారించగా అతను నిజం ఒప్పేసుకోవడంతో కోర్టు ఆదేశాలతో రిమాండుకి తరలించారు. 
Crime Newswomen murder caseman arrestNalgonda DistrictHyderabad

More Telugu News

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17
..more